Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సనత్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసులు మోహరించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ర్యాలీకి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ర్యాలీ కోసం ఎప్పుడో దరఖాస్తు చేశామని తెలిపారు. కానీ నిన్న రాత్రి అనుమతి లేదని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇస్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని.. ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ర్యాలీకి నిన్న ఓకే చెప్పి.. రాత్రికి రాత్రే అనుమతి లేదన్నారని మండిపడ్డారు.
సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా?
ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారు
ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా!!
అనుమతి లేని సెక్రటేరియట్… https://t.co/ctVO1CVIz5 pic.twitter.com/fxojn27H7L
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026