Talasani Srinivas Yadav | మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) శ్రీనివాస్, సూపర్వైజర్ శివకుమార్‌లకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్-స్వర్ణ దంపతులు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా తమ పూర్తి వివరాలతో కూడిన ఎన్యుమరేటర్ పత్రాలను అందజేశారు.
అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు కూడా తమ వివరాలతో కూడిన ఎన్యుమరేటర్ పత్రాలను SIR అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను అధికారులు నమోదు చేసి, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.
