సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో పారిశుధ్య విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే శానిటేషన్ విభాగంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 1050 మంది వర్కర్ల నియామకానికి అనుమతి ఇవ్వాలంటూ.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.
పారిశుధ్య విభాగంలో స్వీపర్ల సంఖ్య తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. స్వీపర్ల శాశ్వత ఖాళీల భర్తీపై నిషేధం (బ్యాన్)పై ప్రభుత్వం నుంచి సడలింపు ఉత్తర్వులు పొందే వరకు శానిటరీ వర్కర్ గ్రూప్ ద్వారా ఔట్ సోర్సింగ్ శానిటేషన్ వర్కర్ క్లాస్-4 ఉద్యోగుల ఖాళీతో ఏర్పడిన పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.