సిటీబ్యూరో, మార్చి23, (నమస్తే తెలంగాణ): గ్రేటర్ మొత్తం ఆదివారం క్రికెట్ సందడి నెలకొంది. ఐపీఎల్-18 సీజన్ ప్రారంభం కావడం, అందులో తొలిరోజే సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడటంతో క్రికెట్ అభిమానులు టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయారు.
ఆదివారం సెలవు రోజు కావడంతో పలు గేటెడ్ కమ్యూనిటీల్లో భారీ స్కీన్ల్రు ఏర్పాటు చేశారు. ముందస్తు టికెట్లు కొనుగోలు చేసుకున్న వారు నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి ప్రత్యేక్షంగా మ్యాచ్‌ను తిలకించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు.