e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home News హైద‌రాబాద్ వాసుల‌కు ఈ సండే మ‌రింత జాలీ.. ట్యాంక్‌బండ్‌పై స్పెష‌ల్‌ ట్రీట్‌

హైద‌రాబాద్ వాసుల‌కు ఈ సండే మ‌రింత జాలీ.. ట్యాంక్‌బండ్‌పై స్పెష‌ల్‌ ట్రీట్‌

Hyderabad | హైద‌రాబాద్ వాసుల‌కు ఈ సండే మ‌రింత జాలీగా మార‌నుంది. ఆదివారం సాయంత్రం వేళ‌ల్లో హాయిగా తిరిగేందుకు ట్యాంక్‌బండ్‌ ( Tank Bund )పై ఇప్ప‌టికే ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఇప్పుడు మ‌రిన్ని హంగులు దిద్దారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత వినోదం అందించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

ఇప్ప‌టికే ట్యాంక్‌బండ్ అందాల‌ను న‌గ‌ర‌వాసులు ఆస్వాదించేందుకు ట్యాంక్‌బండ్‌ను ట్రాఫిక్ ఫ్రీగా మార్చేశారు. ప్ర‌తి ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ, న‌గ‌ర‌వాసులు ట్యాంక్‌బండ్‌పై కాలిన‌డ‌క‌తో అంతా ప‌ర్య‌టించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తుంది. వీకెండ్‌లో ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌కు వ‌చ్చి కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పిల్ల‌ల‌కు సంబంధించిన మ‌రిన్ని వినోద కార్య‌క్ర‌మాల‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. క‌ళ‌లు, హ‌స్త‌క‌ళ‌ల‌కు సంబంధించిన స్టాల్స్‌తో పాటు సంగీత కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. హైద‌రాబాద్ రుచుల‌ను చూసేందుకు ప్ర‌త్యేకంగా ఫుడ్ ట్ర‌క్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు హుస్సేన్ సాగ‌ర్‌పై లేజ‌ర్ షోతో పాటు ట్యాంక్‌బండ్‌పై అన్ని వైపులా ప్రేక్ష‌కుల గ్యాల‌రీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్ర‌త్యేక‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ట్యాంక్‌బండ్‌పై ఈ సండేను మ‌రింత ఫ‌న్‌డే గా మార్చుకోమ‌ని ట్వీట్ చేశారు.

ట్యాంక్‌ బండ్‌ ఓ మణిహారం

- Advertisement -

వీకెండ్స్‌లో కుటుంబ సమేతంగా ప్రతి నగరవాసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి, లేదా పార్కులకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ప్రధాన నగరాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు.. న్యూ యార్క్‌ నగరానికి ‘లిబర్టీ ఐల్యాండ్‌’… లండన్‌ నగరానికి ‘ట్రాఫాల్‌గర్‌ స్కేర్‌’… మాదిరిగా హైదరాబాద్‌ నగరానికి ట్యాంక్‌బండ్‌ ఒక మణిహారం. అలాంటి ట్యాంక్‌ బండ్‌ను అత్యాధునిక హంగులతో, వారసత్వ శోభలను సంతరించుకొని అటు నగరవాసులను, ఇటు పర్యాటకులను ఆహ్లాదపరిచ్చేందుకు సిద్ధమైంది.

ఈ క్ర‌మంలోనే ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించకుండా పూర్తిగా సందర్శకులు మాత్రమే తిరుగుతూ అక్కడి అందాలను పూర్తి స్థాయిలో ఆదివారం సాయంత్రం వేళల్లో నగరవాసులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సుమారు రూ.27 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఇప్పటికే 90 శాతం సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. సుందరీకరణలో భాగంగా ఇరువైపులా ఫుట్‌పాత్‌లను పూర్తిగా తొలగించి, ఆధునీకరించారు. ఎంతో విశాలంగా ఉన్న ట్యాంక్‌ బండ్‌పై గ్రానైట్‌ రాళ్లతో ఫుట్‌పాత్‌లను తీర్చిదిద్దారు.

పీవీసీ పైపులను, వరద నీటి పైపు లైను వ్యవస్థను భూగర్భంలోంచి వేశారు. ట్యాంక్‌ బండ్‌ ప్రాంతం గట్టిగా ఉండేందుకు క్రషర్‌ సాండ్‌తో పీసీసీ, స్లాబ్‌ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ చేశారు. 25-30 మందంతో గ్రానైట్‌ రాళ్లను ప్లేమ్‌ ఫినిష్డ్‌ ఉపరితలంలో వేశారు. కాగా, ప్రతియేటా గణేశ్‌ ఉత్సవాల సమయంలో విగ్రహాల నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసే క్రేన్‌ల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేశారు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఫుట్‌పాత్‌ ఆధునీకరణ పనులకు మొత్తం రూ.14.50 కోట్లను ఖర్చు చేయగా, రూ.12.50 కోట్లతో హేరిటైజ్‌ శైలిలో విద్యుత్‌ దీపాలంకరణను చేపట్టారు. హైదరాబాద్‌ నగరం అంటేనే ఎంతో పురాతన, వారసత్వ సంపదకు నిలయం. అలాంటి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ కట్టపై అలనాటి వారసత్వాన్ని కళ్ల ముందుంచి సరికొత్త తరహాలో విద్యుద్దీపాలంకరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

సీఐ (క్యాస్‌ ఐరన్‌) రెయిలింగ్‌, హెరిటేజ్‌ ఆర్నమెంటల్‌ డెకరేటివ్‌ సోల్స్‌, ఆధునిక శైలిలో రూపొందించిన బస్టాప్‌లను, రెయిన్‌ షెల్టర్లను, కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణతో కూడిన వీధి దీపాల స్తంభాలను ప్రతి 15 మీటర్లకు ఒకటి ఎడమ వైపు, ప్రతి 30 మీటర్లకు ఒకటి చొప్పున కుడివైపున ఏర్పాట్లు చేశారు. వర్షాకాలంలో వర్షపు నీరు ట్యాంక్‌ బండ్‌ రోడ్డుపై నిల్వకుండా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ట్యాంక్‌బండ్‌పై నుంచి చూసేందుకు ఇక్కడి నుంచి అవకాశముంది. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ విన్యాసాలు, బోటింగ్‌లో తిరిగే వారిని వీక్షించడంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకమైన హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని నగరవాసులు వీక్షిస్తూ ఆహ్లాదకరమైన వాతావారణాన్ని అస్వాదించేలా ఏర్పాట్లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండ‌గానే యాక్సిడెంట్ జ‌రిగింది : న‌రేశ్

Thrill City | థ్రిల్ సిటీ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement