Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఎండలు( Summer ) మండిపోతున్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ చిరుజల్లులు( Rains ) కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( Weather Dept ) తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది. రాత్రి పూట 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజుల్లో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఇక అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.