బీఆర్ఎస్వీ పోరుబాట ముగిసింది. పది రోజుల పాటు హిమాయత్ సాగర్ నుంచి నాగోల్ దాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు బీఆర్ఎస్వీ ప్రతినిధులు, విద్యార్థులు వందలాదిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట చేస్తున్న లక్షన్నర కోట్ల రూపాయల కుంభకోణాన్ని ప్రజలకు వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార కుట్రను ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించారు.
బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రతి బస్తీ, ప్రతి కాలనీ కలియ తిరిగి ప్రజలకు కాంగ్రెస్ మోసాలను వివరించారు. కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసాన్ని బస్తీల ప్రజలకు వివరించారు. ఆయా కాలనీల్లోని యువత, మేధావులు, బుద్ధిజీవులను కలిసి ప్రభుత్వ విధ్వంసాన్ని వివరించారు. డప్పుదరువులు, ఆట పాటలతో బస్తీ ప్రజల్లో చైతన్యం నింపారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో కాంగ్రెస్ సృష్టిస్తున్న విధ్వంసాన్ని ప్రజల ముందుంచారు. 52 కిలోమీటర్ల మూసీ పరీవాహకంలోని 3 వేలకు పైగా ఎకరాలను రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున కుట్రలను ఎండగట్టారు. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తామని ప్రకటించారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తూ పోరుబాటను
– సిటీ బ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)
పది రోజుల పాటు బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు మూసీ పరీవాహక బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. నాగోల్, అంబర్‌పేట, హైదర్‌గూడ, గంధంగూడ, గోషామహల్ వంటి ప్రాంతాల్లో మూసీ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి వారిలో ధైర్యం నింపారు. పలు బస్తీల్లో కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళనకు ఒక్క ఇంటిని కూల్చకుండా కేసీఆర్ నాగోల్‌లో చేసిన సుందరీకరణను ప్రజలకు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 31 ఎస్టీపీలను కట్టి మురుగును పారదోలిన విధానం వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు, గ్రామసభలకు భయపడొద్దని.. ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లను కూల్చనీయకుండా బీఆర్ఎస్తో పాటు విద్యార్థి విభాగం అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. తరతరాలుగా మూసీ నదీతీరంలో జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆత్మరక్షణలో పడ్డ బస్తీ వాసులకు మేమున్నామంటూ ఆత్మైస్థెర్యాన్ని నింపారు.
నిజాం కాలం నుంచి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇండ్లు, భూములను ప్రభుత్వం లాక్కొంటుందనే మనస్తాపంతో మూసీ పరీవాహక ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వానికి ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల ఇండ్లను చెరబట్టేందుకు సిద్ధం అవుతున్నారని విమర్శించారు. బస్తీల ప్రజలకు పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించడకుండా బలవంతంగా ఇండ్లను కూల్చేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ నిరంకుశ పాలనకు ప్రతిబింబంగా నిలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల తరఫున పోరాడుతామన్నారు.
కాలుష్యం పేరిట జియాగూడ కబేళాను ప్రభుత్వ అధికారులు మూసేశారు. సుందరీకరణలో భాగంగా ఆ ప్రాంతాన్ని లాక్కొనేందుకు ప్రయత్నించారు. బాధితులకు సంఘీభావంగా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, కార్వాన్ బీఆర్ఎస్ ఇన్చార్జి జీవన్ సింగ్‌తో కలిసి ఆందోళన చేపట్టారు. బాధితులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే కబేళాను తెరవకపోతే జీహెచ్ఎంసీ కార్యాలయం ముందే కబేళాను ఏర్పాటు చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. దిగొచ్చిన ప్రభుత్వం వెంటనే కబేళాను తెరిపించింది. ఆరెకటికలు కృతజ్ఞతలు తెలిపారు.