హైదరాబాద్ : కరెంట్ షాక్తో(Electric shock) విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన నారాయణ కళాశాలలో(Narayana College) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ నారాయణ కళాశాలలో గిరీష్ కుమార్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక అర్దరాత్రి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో గోడ పైన ఉన్న విద్యుత్ తీగల తగిలి గిరీష్ మృతి(Student died) చెంది నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.