Minister KTR | ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు.. ప్రకటించిన మంత్రి కేటీఆర్
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటించారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటించారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్( RHS Flyover )ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఎస్ఆర్డీపీ(SRDP ) కింద ఎల్బీ నగర్( LB Nagar ) నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ 9వ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయి.. బైరామల్‌గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
నాగోల్ నుంచి ఎల్బీ నగర్‌కు మెట్రోను తీసుకొస్తాం..
ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఈ ఫ్లై ఓవర్లు మాత్రమే కాదు.. ప్రజా రవాణా మెరుగుపడల్సిన అవసరం ఉంది. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. తప్పకుండా నాగోల్( Nagole ) నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను తీసుకువస్తాం. హయత్‌నగర్( HayathNagar )కు కూడా విస్తరిస్తాం. ఎయిర్‌పోర్టు( Airport ) వరకు కూడా మెట్రోను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గడ్డి అన్నారం మార్కెట్లో వెయ్యి పడకల టిమ్స్( TIMS )ను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే సంవత్సరన్నర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. జీవో నంబర్ 118 కింద దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చొరవతో పరిష్కరించుకున్నాం. ఈ నెలఖారు వరకు పట్టాలు అందించి, ఆ బాధ నుంచి విముక్తి చేస్తాం. మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

