మహాశివరాత్రికి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం అధిక సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ జె.శ్రీలత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 11: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం అధిక సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ జె.శ్రీలత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి సాధారణ బస్సులతోపాటు అదనపు ప్రత్యేక బస్సులు కలిపి మొత్తం 405 బస్సులు (రెగ్యులర్-స్పెషల్)శ్రీశైలంకు నడపనున్నట్లు ఆమె వివరించారు.
గత సంవత్సరం శివరాత్రి సందర్భంగా 289 బస్సులు నడుపగా.. ఈ ఏడాది ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా నడుపబడే బస్సులకు 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది, వాహనాల సిద్ధత, పర్యవేక్షణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకొని శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని ఆమె కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

