సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసానికి తెగబడుతున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి స్టాక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలొస్తాయంటూ నమ్మించి రూ. 56.12 లక్షలు సైబర్ దోపిడీకి పాల్పడ్డారు. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు .. సైనిక్‌పురికి చెందిన ఐటీ ఉద్యోగి. ఈ ఏడాది మార్చి నెలలో ఏ5 అస్క్ ఎక్సుక్లూజివ్ ఇన్వెస్టర్స్ అండ్ 1-1వీ1 వీఐపీ గ్రూప్ ఎక్సేంజింగ్ అండ్ ప్రమోటింగ్ ట్రేడింగ్ అనే వాట్సాప్ గ్రూప్‌లో నంబర్‌ను యాడ్ చేశారు. అందులో ఉన్న వాళ్లు ఫలానా స్టాక్స్ ఈ రోజు చాలా ట్రెండింగ్‌లో ఉంటాయి, ఐపీఓలు ఇలా వివిధ రకాల స్టాక్స్ గూర్చి చర్చించుకుంటారు.
దీంతో బాధితుడు మీరు చేసే ట్రేడింగ్ గూర్చి తెలుసుకోవాలని ఉందంటూ గ్రూప్ అడ్మిన్‌ను అడగడంతో మీకు ట్రేడింగ్ యాప్‌లో అకౌంట్ ఉందా అంటూ అడిగారు, లేదనగానే ముందుకు అస్క్ మిన్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి అందు లో హెచ్‌ఎన్‌డబ్ల్యూ(హై నెట్ వర్త్) అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలంటూ సూచిండంతో అడ్మిన్ సూచనలను ఫాలో అయ్యాడు. ట్రేడింగ్‌పై బాధితుడు పెట్టుబడి పెట్టడంతో అందులో లాభాలొచ్చాయి. ఇ లా దఫ దఫాలుగా బాధితుడు రూ. 56 లక్షల వరకు పెట్టుబడి పెట్టా డు. ఈ రోజే నిబంధనలు మారాయంటూ నిర్వాహకులు చెప్పడం తో యాప్‌పై అనుమానం వచ్చి రాచకొండ సైబర్క్రైమ్పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.