MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 18 : స్నేహపురి కాలనీలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే కృష్ణారావు సన్మానించారు.
కాలనీలో ఓపెన్ నాలా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని, పలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధి చేసేందుకు కమిటీ సభ్యులకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, చలమారెడ్డి, శ్రీనివాస్, దశరథ్, మస్తాక్, వసీం, దిలీప్ తదితరులు ఉన్నారు.