Marriage fraud | వెంగళరావు నగర్, ఫిబ్రవరి 16: స్నాప్ చాట్ (Snap chat) ద్వారా పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె పేరిట రుణాలు, వాహనాలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యువకుడిపై ఎస్.ఆర్.గర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి(26) సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. ఈమెకు 2024 జూన్‌లో కూకట్పల్లి సమీపంలోని గోపాల్‌నగర్‌కు చెందిన ధీరజ్ రెడ్డి(26) స్నాప్ చాట్ ద్వారా పరిచయమయ్యాడు. ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించాడు. ఆ తరువాత యువతి పేరిట ఆన్ లైన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకున్నాడు. ఓ కారు, స్కూటీతో పాటు ఐపాడ్ వంటి విలువైన వస్తువులు యువతి పేరిట కొనుగోలు చేశాడు. ఆ తరువాత నవంబరు 2024 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకుని తిరగసాగాడు.
బాధితురాలు ఇటీవల ధీరజ్ రెడ్డి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు సానుకూలంగానే స్పందించినట్లు నటించి యువతిని పంపివేశారు. మరుసటి రోజు ఫోన్ చేయగా ధీరజ్ రెడ్డి తల్లిదండ్రులు బాధితురాలిని బెదిరించారు. దీంతో యువతి ఎస్. ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్