Kidnap | శంషాబాద్ రూరల్, జూలై 8 : ఆరేండ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన సంఘటన మంగళావారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కాచన్‌పల్లి గ్రామానికి చెందిన కే. లక్ష్మమ్మ భర్త రమేష్ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. తరచు రైలులో ప్రయాణం చేస్తూ శంషాబాద్ పట్టణంతో పాటు హైదరాబాద్ నగరానికి వచ్చి భిక్షాటన చేసేది.
అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన ఇద్దరు పిల్లలతో కలిసి శంషాబాద్ పట్టణానికి వచ్చిన లక్ష్మమ్మ పట్టణంలోని కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లు తాగుతుండగా గుర్తు తెలియని మహిళ వచ్చి ఆమే కూతురు కీర్తన(6)ను పలకరించి బయటకు తీసుకొని వెళ్లిపోయింది. లక్ష్మమ్మ తేరుకొని బయటకు వచ్చి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. చుట్టు పక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో ఆమె స్వగ్రామానికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో మంళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ ఆచూకీ కోసం గాంలింపు చర్యలు ప్రారంభించిన్నట్లు వివరించారు. సీసీపుటేజ్ ఆధారంగా గుర్తు తెలియని మహిళ కల్లు దుకాణం నుంచి నేరుగా శంషాబాద్ బస్‌స్టాండ్‌కు చేరుకున్నట్లు సీసీపుటేజ్ లభించిన్నట్లు తెలిపారు. ఆమెను త్వరలో పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు.