Singireddy Niranjan reddy | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్కున్న ప్రేమలో నీకు ఇసుక రేణువంత కూడా ప్రేమ లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రియల్ ఎస్టేట్, మూసీ నది ప్రాజెక్టుల మీద ఉండే శ్రద్ధ పాలమూరు బతుకుల మీద నీకు ఏనాడూ లేదు. భవిష్యత్‌లో నీకుండదన్నారు. తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో ఆయనమ మాట్లాడుతూ.. నువ్వు కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తవ్. కేసీఆర్ అద్భుతంగా పరుగులు పెట్టించిన పాలమూరు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అని మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి మొత్తం 19 శాసన సభ నియోజకవర్గాల పరిధిలో ఉండే రైతాంగానికి వ్యవసాయ నీరు, రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వ్యాటర్ నుంచి ఎత్తిపోసుకోవడం.. దానికి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు కలిపి 68 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేవి పూర్తి చేసినం మొత్తం 34 పంపులు పెట్టేసినం. ఎలక్ట్రోమెకానిక్ వర్క్స్ పూర్తయిపోయినయ్. 62 కిలోమీటర్ల టన్నెల్స్ పూర్తయినయ్. ఒక్కో టన్నెల్ వ్యాసార్థం 10 ఫీట్లకుపైనే ఉంటది. 915 కిలోమీటర్ల నిడివి ఉండే కెనాల్స్ అందులో డిజైనై ఉన్నయి. ప్రధాన కెనాల్స్ ను ఈ పుణ్యాత్ముడి వచ్చినంక రద్దు చేసిర్రని, టెండర్లు పిలిచినవాటిని కూడా చేశారని ఫైర్ అయ్యారు.
రోజుకు 2 టీఎంసీలు సముద్రమట్టానికి గరిష్టంగా 672 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించాం. 7.15 టీఎంసీల నీటిని 1226 గ్రామాలకు మంచి నీటి అవసరాల కోసం, 3 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం ఈ డిజైన్లలో భాగంగా పెట్టి ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు.. కాంగ్రెస్ పార్టీయే కదా కేసులు వేయించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోకుండా గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీలో కేసులు, వాటర్ ట్రిబ్యునల్ దగ్గర కేసులు, సీడబ్ల్యూసీ దగ్గర కేసులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేశారన్నారు.
పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా సొంత రాష్ట్ర నిధులతో చేపట్టిన ఘనత కేసీఆర్ గారిది.. పాలమూరుపై కేసీఆర్ కు ఉన్న ప్రేమలో ఇసుక రేణువు అంత కూడా రేవంత్ రెడ్డికి ఎప్పుడూ లేదు.
రియల్ ఎస్టేట్, మూసీ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద
పాలమూరు ప్రాజెక్టుల మీద, పాలమూరు ప్రజల బతుకుల మీద లేదు.కేసీఆర్… pic.twitter.com/88uvzIGXjC
— BRS Party (@BRSparty) June 6, 2026
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర