కాచిగూడ, మే 21: రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టు ల్లో బీసీలను విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. బుధవారం కాచిగూడని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులన్నీ అగ్రవర్ణాలకే కట్టబెట్టారని, సమాచార కమిషనర్ నియామకాల్లో ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వరా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మొత్తం సమాచార కమిషనర్ పదవుల్లో ఇప్పటికీ 7 పదవులు భర్తీ చేయగా.. అందులో ఒక్క బీసీకీ అవకాశం ఇవ్వకపోవడం బీసీలను అవమానించడమేనన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన ద్వారా బీసీలకు న్యాయం చేస్తామని గొప్పలు చెప్పి హామీ ఇచ్చారని, ఆ హామీలు ఇప్పటికీ అమలు కావడం కాకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో సౌతిండియా ఇన్చార్జి సూర్యనారాయణ, జానయ్య, నరేందర్, భద్ర, తదితరులు పాల్గొన్నారు.