జూబ్లీహిల్స్, జూలై 15: బోరబండ సైట్-3 జయశంకర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి.. సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించనున్నారు.
ఆయా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులకు అక్కడే అందజేస్తారు. సమస్యలను పరిష్కరిస్తారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు నిర్వహించే సమస్యలపై శంఖారావం కార్యక్రమంలో బస్తీలు, కాలనీల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో సూచించారు.