బల్దియాలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగింది. వివిధ జోన్లకు జాయింట్ కమిషనర్లు (జేసీ), అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను (ఏఎంసీ) నియమిస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగింది. వివిధ జోన్లకు జాయింట్ కమిషనర్లు (జేసీ), అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను (ఏఎంసీ) నియమిస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్ జాయింట్ కమిషనర్‌గా రాజేందర్‌రెడ్డి, గోల్కొండకు కె.శ్రీహరి, శంషాబాద్ జోన్ జేసీగా జి.రాజు, ఖైరతాబాద్ జోన్‌కు వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌కు సయ్యద్ ముసాబ్ను జోనల్ జాయింట్ కమిషనర్లుగా నియమించారు.
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా గోషామహల్ సర్కిల్‌కు ఉమా మహేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం శానిటేషన్ ఏఎంసీగా సమ్రీన్ నాజ్, ప్రధాన కార్యాలయం అడ్మిన్ ఏఎంసీగా శ్రేయ, గోల్కొండ జోన్‌కు స్వర్ణలత, చార్మినార్‌కు రజని, చాంద్రాయణగుట్టకు మహేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ జోన్‌కు వసంతను నియమించారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ విధుల్లో చేరి నివేదికను సమర్పించాలని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

