Padma Rao Goud | అప్పుడు పోని కరెంటు.. ఇప్పుడెందుకు పోతుంది.?: పద్మారావుగౌడ్
ప్రజల ఆశీర్వాదం పద్మారావుగౌడ్‌కు ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాడని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు చేసింది శూన్యం
- నియోజకవర్గం అంతా నా ఇళ్లు.. ప్రజలంతా నా కుటుంబ సభ్యులే
- మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- దానం నాగేందర్ గురించి మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుంది
- సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్
Padma Rao Goud | సికింద్రాబాద్, మార్చి 24 : ప్రజల ఆశీర్వాదం పద్మారావుగౌడ్‌కు ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాడని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌ను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు పద్మారావు నివాసంలో సమావేశమయ్యారు.
ముందుగా ఆయనకు అభినందనలు తెలిపి ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, నేతలు ముఠా జై సింహ, మన్నె గోవర్ధన్‌తో సహా ఏడు నియోజకవర్గాల నేతలు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజుల్లో తెలంగాణ భవన్లో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రకటిస్తామని తెలిపారు.
అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ ప్రజలు శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ అంటే గుర్తు పట్టనివారు ఉండరని, ప్రజలకు సేవ చేయడంతోనే తమకు పేరు వచ్చిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు డైనమిక్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోని కరెంటు ఇప్పుడు ఎందుకు పోతుందని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని తెలిపారు. కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేమి లేదన్నారు. గల్లీ లీడర్లు లేనిది ఢిల్లీ ఎకడిదని పద్మారావు ప్రశ్నించారు. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. దానం నాగేందర్ గురించి మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుందని, ఎప్పుడూ పార్టీ మారుతూనే ఉంటాడని విమర్శించారు.
భారీ మెజార్టీతో పజన్న గెలుపు ఖాయం : తలసాని
సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించగానే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి, ఓటు అభ్యర్థిస్తామని తెలిపారు.
రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రి : మాజీ హోంమంత్రి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రైతు బంధు, రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి సంకేతాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యమ కారుడైన పద్మారావు గౌడ్‌ను అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
దానం ఏ పార్టీలో ఉంటాడో తెల్వదు
దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెల్వదని, గెలిచినా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడనే గ్యారెంటీ లేదని జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ, శైలజ, సునీత ముషీరాబాద్ యువ నేత ముఠా జైసింహ, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్దన్, యువ నేత రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

