Awards | అవార్డులు అందుకున్న రైల్వే అధికారులకు ఎస్సీఆర్ జీఎం అభినందన
Awards | 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం తదితర విభాగాల దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులను దక్కించుకుంది.
హైదరాబాద్ : 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం తదితర విభాగాల దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులను దక్కించుకుంది. రాష్ట్ర ఇంధన శాఖ, రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌ఈడీసీ) ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి గాను సంస్థ అవార్డులను ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఐదు విభాగాలు, ఏపీకి చెందిన రెండు విభాగాలు అవార్డులు పొందాయి.
ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, విశ్వేశ్వరయ్య భవన్లో అవార్డులు ప్రదానం కార్యక్రమం జరిగింది . రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో నల్గొండ రైల్వే స్టేషన్‌కు గోల్డెన్ అవార్డు, ప్రభుత్వ భవనాల విభాగంలో లేక భవన్‌కు (ఎస్సీఆర్ ఆకౌంట్స్ ఆఫీస్ బిల్డింగ్) కు గోల్డెన్ అవార్డు, రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు సిల్వర్ అవార్డు పొందాయి. ప్రభుత్వ భవనాల విభాగంలో హైదరాబాద్‌లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్సీ) భవనానికి సిల్వర్ అవార్డు, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో లాలగూడలోని క్యారేజ్ వర్క్‌షాపుకు సిల్వర్ అవార్డును దక్కించుకున్నాయి.
ఏపీలో భవనాల విభాగంలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం భవనానికి గోల్డెన్, భవనాల విభాగంలో గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం భవనానికి సిల్వర్ అవార్డును దక్కించుకున్నాయి. 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ఫలితంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో ఉన్న భవనాలు, స్టేషన్లకు అవార్డులు అందాయని రైల్వే అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

