School Bus | కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో పెను ప్రమాదం తప్పింది. విధ్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
పటాన్చెరు, జూలై 10: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో పెను ప్రమాదం తప్పింది. విధ్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులోకి కిష్టారెడ్డిపేట వద్ద విద్యార్థులు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ పిల్లలను వెంటనే బయటకు దింపేశారు. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

