Satyavathi Rathod | మంత్రి సీతక్క తనపై ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకొని కొడతామని బహిరంగంగా అనడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. సీతక్క వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.
నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది. దానికి నువ్వుసరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సీతక్కకు సూచించారు. మహిళాశిశు సంక్షేమ శాఖలోమొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, డబ్బులు చేతులు మారాయని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ అన్ని ఆధారాలతో స్కాంను బయటపెట్టిన్రు. ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు. కానీ ఆయనను పట్టుకుని చెప్పు తెగుతది.. చెప్పు తీసుకొని కొడతా. ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. ఆ మాటలు మాకు రావా..మా దగ్గర లేవా. నీ మీద అవినీతి ఆరోపణలు వస్తే.. అవినీతి జరుగలేదని చెప్పు. ఎవరు చేసిర్రో చెప్పు అనిడిమాండ్ చేశారు.
38వేల పైచిలుకు సెల్ఫోన్లు కొంటే 4జీ ఇచ్చి, ఏపీలో 5జీ ఇచ్చి ఆ ఫొటోలు తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్నరు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య. ఏపీలో 5జీఇచ్చిన్రు. ఆ ఫోన్లు తెలంగాణలో ఇచ్చినట్టు 4జీ ఇచ్చి ఫొటోలు చూపించుకున్నరని ఆరోపించారు.
మొబైల్ ఫోన్లలో స్కామ్ జరిగింది అంటే జరగలేదని నిరూపించు
చెప్పుతీసుకొని కొడతానని అంటే మా దగ్గర చెప్పులు లేవా
– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ https://t.co/pfzXMRI6m1 pic.twitter.com/Jsg1SDAiIQ
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2026
Ambedkar Jayanti | తెలంగాణభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్