సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. ఇప్పటివరకు మెట్రో ఎండీగా కొనసాగిన ఎన్వీఎస్ రెడ్డిని అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజరీగా నియమించగా..ఆ బాధ్యతలను ఇకపై సర్ఫరాజ్ అహ్మద్ నిర్వర్తించనున్నారు.
ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్వీఎస్ రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనుండగా.. అర్బన్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన సేవలు కీలకంగా ఉంటాయని పలువురు అధికారులు పేర్కొన్నారు. ఇక హెచ్ఎండీఏ సెక్రటరీగా కొనసాగుతున్న ఉపేందర్ రెడ్డి బాధ్యతలను ఐఏఎస్ శ్రీవత్సకు అప్పగించింది. ప్రస్తుతం ఆయన జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా హెచ్ఎండీఏలో కొనసాగుతున్నారు.