బాలానగర్ : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ (Sardar Sarvai Papannagoud) ఆదర్శ ప్రాయుడని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram Krishna Rao) అన్నారు. ఆదివారం సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి సందర్భంగా కూకట్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీక అన్నారు. ఆయన ఆశయాల సాధనకు నేటి యువత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆనాటి సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను రూపుమాపడానికి, రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండవర్గాల సమన్వయంతో ఆయన చేసిన కృషిని కొనియాడారు.
బహుజన రాజ్యాధికారంలో కోసం పోరాటం చేసిన పోరాట వీరుడు సర్దార్ పాపన్నగౌడ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూసాపేటలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతాపార్టీ కూకట్పల్లి ఇన్చార్జి మాధవరం కాంతారావు కూకట్పల్లిలో నిరహించిన సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
Srinivas goud | పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి : శ్రీనివాస్ గౌడ్