హైదరాబాద్ : బడుగుల రాజ్యాధికారం కోసం ధిక్కార స్వరం వినిపించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. గతంలో ఎవరు కూడా సర్ధార్ పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna goud) జయంతిని చేయలేదు. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas goud) అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తుల సంక్షేమానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందని పేర్కొన్నారు. గౌడ భవన్కు నిధులు కేటాయించి, దానికి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరుని పెట్టారు. విగ్రహ ఏర్పాటుకు నిధులు కేటీయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా అయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీ జనగణనను వెంటనే చేపట్టాలన్నారు.