హైదరాబాద్ : భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.9 వేలు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు తమకు వేతనాలు ఇవ్వాలని వర్షంలో ఆందోళనకు దిగారు. జీతాలు(Salaries) త్వరగా చెల్లించాలని, ప్రతి నెల రూ.15 వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వర్షంలో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులు..
గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.9 వేలు ఇస్తుందని ఆగ్రహం..
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు తమ వేతనాలు ఇవ్వాలని వర్షంలో ఆందోళనకు దిగారు.
గత ప్రభుత్వంలో రూ.15 వేల… pic.twitter.com/LhMjRNavr5
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024