Sammakka- Sarakka Jatara | బండ్లగూడ, ఫిబ్రవరి 13: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బుధవారం ప్రారంభమైన సమ్మక్క-సారక్క జాతర వేడుకలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు భక్తులు భారీగా అమ్మవార్లను దర్శించుకున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచిన అమ్మవార్లను దర్శించుకునేందుకు రాజేంద్రనగర్ శివారు ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తరలి వచ్చారని నిర్వాహకులు చంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం తమ కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవార్లను వనంలోకి పంపుతామని తెలిపారు.