బడంగ్‌పేట, ఫిబ్రవరి13 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దళితులు వ్యాపార రంగంలో రాణిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన 10 మందికి దళితబంధు రావడంతో గ్రామ సర్పంచ్ అనితా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు.
లబ్ధి పొందిన వారిలో ఎర్ర భాస్కర్, ఎర్ర రవి, బొల్లెపాక రవి, బొల్లె పాక నర్సింహ, ఎర్ర బాల్‌రాజ్, ఎర్ర శంకరయ్య, ఎర్ర అంజయ్య, ఆండాలు ఉన్నారు. వీరిలో కొంతమంది వ్యాపారం, కొందరూ పాలకేంద్రాలను పెట్టుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. విడుతల వారీగా అందరికి దళితబంధు అందజేస్తామని పేర్కొన్నారు. రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.