శంషాబాద్ రూరల్, నవంబర్ 9: బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శంషాబాద్ మండలంలోని కాచారం, నర్కూడ, చౌదర్‌గూడ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో సబితారెడ్డి సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వివరించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనం ఇచ్చేవని.. రాష్ట్ర ఏర్పాటుతో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు.
అనుకోకుండా వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి అనేక అబద్ధాలు చెప్పడంతో పాటు కాంగ్రెస్‌కు ఓట్లు వేయకుంటే సంక్షేమ పథకాలు బంద్ చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంచర్ల మోహన్‌రావు, బీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీష్, దిద్యాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్‌పాషా, చౌదర్‌గూడ గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్మ గోపాల్, మహేష్‌యాదవ్, జంగయ్య, శ్రీశైలం, రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని చౌదర్‌గూడ, నర్కూడ, కాచారం గ్రామాల నుంచి పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని గతంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో పని చేశామని.. వారు ప్రజలను పట్టించుకోవడం లేదని వారు వివరించారు. చెంగలి కృష్ణ, ఉదయ్, మనీష్, గిరి, సాయి, హరీష్, చౌదర్‌గూడ గ్రామానికి చెందిన రమేష్, సంతోష్, రామకృష్ణ, సుధాకర్, రాములు, కాచారం గ్రామం నుంచి కమ్మరి మహేష్, తాళ్ల మహేష్, రషీద్‌ఖాన్, సిద్ధుయాదవ్తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.