శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 28: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తచాటి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాలన తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచిందన్నారు. ఆదివారం శంషాబాద్ పట్టణంలోని హుడాకాలనీలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షత ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గ్యారెంటీ కార్డుల పేరుతో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్,రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.