Harish Rao | నేను కేటీఆర్.. కేసీఆర్‌తో మాట్లాడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని హరీశ్‌రావు తెలిపారు. ఆరోజు మీరు అడగకపోయినా హైదరాబాద్‌లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎకరం భూమి ఇచ్చిండని గుర్తుచేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లో వడ్డెర ఆత్మగౌరవ భవనానికి స్థలాలను కేటాయించిందని చెప్పారు. దాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎక్కడా కొత్త స్కీమ్ పెట్టింది లేదు కొత్త భవనం కట్టింది లేదని విమర్శించారు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు, బిల్డింగ్ లకు రిబ్బన్లు కట్ చేసుడు.. కేసీఆర్ పెట్టిన స్కీములను కటింగ్ చేసుడు చేస్తుండని అన్నారు. కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్ని పథకాలకు కత్తెర పెట్టిండని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవులకు, కురుమలకు ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్‌లో నిర్మించామని చెప్పారు.
రేవంత్ రెడ్డి.. ఒక రూపాయి అయినా బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ఇచ్చావా అని హరీశ్‌రావు విమర్శించారు.రేవంత్ రెడ్డికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రారంభించిన బీసీ ఆత్మగౌరవ భవనాలకు నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వడ్డెర సమాజం రాజకీయంగా, ఆర్థికంగా పైకొచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. వడ్డెర అంటే బండ జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి అని హరీశ్‌రావు అన్నారు.
జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయి చిన్నపిల్లలు ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. గోపీనాథ్ చనిపోతే ఆ కుటుంబాన్ని అనాథలుగా వదిలేయమంటారా అని ప్రశ్నించారు. భర్త చనిపోతే ఏడ్చిన ఆడపడుచుని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరి ఓటు 11వ తారీఖు రోజు పోలింగ్ బూత్‌కు పోయి సునీతమ్మకు ఓటు వేయాలన్నారు. కారు మీద ఓటు గుద్దితే రేవంత్ రెడ్డి గువ్వ గుయ్యిమనాలన్నారు.