Manne Krishank | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో బేగంపేట్ విమానాశ్రయం రోడ్డు వద్ద కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు, సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు, 77 ఢిల్లీ పర్యటనల ఖర్చులపై 420 ఫీట్ల భారీ బ్యానర్లతో నిరసన చేపట్టారు. పోలీసులు బ్యానర్ కార్డులను ఎత్తుకెళ్లిపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, మన్నె క్రిశాంక్, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నడా..? ఈ 1000 రోజుల్లో 300 రోజులు ఆయన బయటనే ఉన్నడు కదా… ఇప్పటివరకు 77 రోజులు ఢిల్లీ ట్రిప్పులు, మంత్రుల మధ్య పంచాయతీలు, ఎమ్మెల్యేల మధ్య పంపకాల పంచాయతీలు, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం వీళ్లు పెడుతున్న ఒత్తిళ్లు.. ఇవన్నీ చూసుకుంటే ఆయన చేసిన వెయ్యి రోజుల పాలన ఎక్కడుంది..? అని ప్రశ్నించారు.
ఈ 77 ఢిల్లీ ట్రిప్పుల్లో మొత్తం 200 రోజులు అనుకుంటే.. మళ్లీ ఫారిన్ ట్రిప్పులు.. కొరియా, అమెరికా, జపాన్, యూకే, దుబాయ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ అంటడు… కానీ ఒక్క పెట్టుబడి కూడా తీసుకుని రాలేదు కదా.. అంటే 1000 రోజుల్లో 300 రోజులు అక్కడే.. రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు, ఫారిన్ ట్రిప్పుల కోసం 300 రోజులు బయటే తిరిగాడు. రేవంత్ రెడ్డి విలాసమైన ఈ హాలిడేల కోసం రూ.400 కోట్ల పైన ఖర్చు అయిందని ఫైర్ అయ్యారు.
బేగంపేట్ విమానాశ్రయం రోడ్డు వద్ద కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్, ఇతర నాయకుల నిరసన
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు, సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు, 77 ఢిల్లీ పర్యటనల ఖర్చులపై 420 ఫీట్ల భారీ బ్యానర్లతో నిరసన… https://t.co/aVpxhlUAA0 pic.twitter.com/A4SemeiUXS
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026