Harish Rao | సమస్యలను ఎత్తి చూపే వార్తలను కవరేజ్ చేయాలి..సాగునీటి కష్టాలు, ఎల్‌నినో కష్టాలతో మాకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది..మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడం ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మా బాధ్యతఅని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.. కాలం తెచ్చిన కరువు కాదు..నీళ్లు, కరెంట్, విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది..ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
శ్రీశైలం నుంచి తెలంగాణ 84 tmc నీళ్లు వాడుకున్నారని చెప్పారు.. పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా మాత్రమే శ్రీశైలం నీళ్లు వాడుకోవచ్చు.. పాలమూరును పట్టించుకోకుండా పడావు పెట్టారు.. కేవలం కల్వకుర్తి నుంచి 84 tmc ల ఎత్తిపోయడం సాధ్యం కాదు.. 8 tmc లు మాత్రమే కల్వకుర్తి నుంచి ఎత్తిపోశారు.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఎల్లూరు పంపు హౌస్ మోటార్లు సరిగా నడపడం లేదన్నారు.
అన్ని ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు ఎండిపోయేలా..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణ నీళ్లను అతి తక్కువ వాడుకున్నదని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణ నీళ్లను అతి తక్కువ వాడుకున్నారు..28 శాతం నీళ్లను మాత్రమే వాడుకున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రి విఫలం అయ్యారు..3 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చి.. నీళ్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంకు అప్పగిస్తే నడపడం చేతకావడం లేదు..ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా..
కృష్ణా నీళ్లను ఈ సంవత్సరం 83 tmc లు ఆంధ్ర తరలిస్తే.. తెలంగాణ కేవలం 4 tmc నీళ్లు వాడుకుంది. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి నుంచి నీటిని తీసుకురావాలి.. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టును ఎండిపోయేలా చేస్తున్నారు..కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది అని అబద్ధాలు చెబుతున్నారు..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పటిష్టంగా ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సీపీడబ్లూఆర్ఎస్ సంస్థ స్పష్టం చేశాయి.మేడిగడ్డ కేవలం 7వ బ్లాక్ దెబ్బతింది.. మిగిలిన నిర్మాణాలు బాగా ఉన్నాయని స్పష్టం చేసింది..మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 46,990 కుస్సెకుల ప్రవాహం ఉంది.. 96 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉంది..93 మీటర్లు ప్రవాహం ఉంటే ఎత్తిపోయవచ్చు.. నీళ్లు ప్రవహిస్తుంటే కూడా ఎత్తిపోయవచ్చు అని విశ్రాంత ఇంజనీర్ అధికారులు చెప్పారు..కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది..
దానిని తప్పించుకునేందుకు, కేసీఆర్‌కు పేరు వస్తుందని కుట్రలు చేస్తున్నారు..సాకులు చెప్పి సరిపెట్టుకుంటున్నారు..విశ్రాంత ఇంజనీర్ అధికారులను కూడా తిట్టారు..నీటిని ఎత్తిపోయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని ఎన్ డీ ఎస్ ఏ స్పష్టం చేసింది..నీటిని ఎత్తిపోసే విషయంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు అడుగుతుందన్నారు..దేవాదుల ప్రాజెక్టుపై కూడా బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి తెస్తే 9 మోటార్లు నడుపుతున్నారు..ఎల్లంపల్లి నుంచి 37 tmc నీళ్లు ఎత్తిపోయడానికి కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారు.. కానీ 6 TMC నీళ్లు ఎత్తి పోస్తున్నారు.. అక్కడ కూడా కుట్ర చేస్తున్నారు..
నీళ్ల విషయంలో కరువుకు కారణం కాంగ్రెస్ నిర్వాకమేనని హరీశ్ రావు అన్నారు.. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నం అని అబద్ధాలు చెబుతున్నారు..
కేసీఆర్ మన రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చారు..యాదాద్రి నుంచి 4 వేల మెగావాట్ల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.. కానీ 15 వందల ఉత్పతి అవుతుంది..భద్రాద్రి ప్లాంటు 540 మెగావాట్ల ఉత్పత్తి, కొత్తగూడెం ప్లాంటు 800 మెగావాట్ల ఉత్పత్తి నిలిపేశారు..v బొగ్గు లేక ఉత్పత్తి ఆగింది.. ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.
అసెంబ్లీలో అన్నీ ఎండగడతామనే..
కరోనా సమయంలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారు.. అసెంబ్లీలో ఇవన్నీ ఎత్తిచూపుతామని మమ్మల్ని సస్పెండ్ చేశారు.. మేము స్పీకర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినా వినిపించుకోలేదు.. రైతులు రోడ్ల మీదికి వస్తే.. వారు బీఆర్ఎస్ కార్యకర్తలు అని అబద్ధాలు చెబుతున్నారు.. ఆంధ్రా ప్రభుత్వం నీటిని తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు.. 38 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలు ఎలా అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు..
ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినప్పుడు అంచనాలు పెరిగాయి..కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు, భూ సేకరణ, పరిహారం పెరిగింది..చిన్నదైన తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం అంచనాలు పెంచారు..కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కూడా అంచనాలు ఐదింతలు పెంచారు.. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు
ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన రెండో అబద్ధం శ్రీశైలంలో 84 టీఎంసీల నీళ్లు వాడామని చెప్పాడు
కానీ శ్రీశైలంలో లిఫ్ట్ చేసింది కేవలం 8 టీఎంసీలు మాత్రమే
శ్రీశైలం నుండి నీళ్లు ఎత్తడానికి మనకు ఉన్నది కేవలం కల్వకుర్తి ప్రాజెక్ట్ మాత్రమే… https://t.co/K9K2ZdpnOa pic.twitter.com/arBFAbxFnU
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2026
నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు
కృష్ణా నదిలో అత్యధిక నీటి వాడకం మా ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పాడు
CWC లెక్కల ప్రకారం కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అని స్పష్టం అవుతుంది
ఏపీ 71.5% కృష్ణా… pic.twitter.com/RZihNV6NdS
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2026
Plank Exercise | రోజుకు 60 సెకన్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ తగ్గుతుంది.. నిపుణుల వెల్లడి..
RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు!
iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్ అమ్మకాలు..!