Nihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిని కాపాడిన మహిళా పోలీస్.. నిహంగ్ సిక్కులు ఆమెపై దాడి
Nihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిపై దాడిని అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు మహిళా పోలీస్ అధికారిణి ప్రయత్నించారు. అయితే నిహంగ్ సిక్కుల గుంపు ఆమెపై దాడి చేశారు. ఆ పోలీస్ అధికారిణి డ్రెస్ కాలర్ పట్టుకుని ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు.
చండీగఢ్: ఒక వ్యక్తిపై దాడిని అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు మహిళా పోలీస్ అధికారిణి ప్రయత్నించారు. అయితే నిహంగ్ సిక్కుల గుంపు ఆమెపై దాడి చేశారు. ఆ పోలీస్ అధికారిణి డ్రెస్ కాలర్ పట్టుకుని ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Nihang Group Assaults Woman Cop) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కొంతమంది నిహంగ్ సిక్కులు అమృత్‌సర్‌లోని ఝబాల్ రోడ్డుపై రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఒక నిహంగ్ సిక్కు బైక్‌పై అక్కడి వచ్చాడు. అయితే ప్రత్యర్థి వర్గం గూఢచర్యం కోసం అతడ్ని అక్కడకు పంపినట్లు నిరసనకారులు అనుమానించారు. ఈ నేపథ్యంలో అతడిపై దాడి చేశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గేట్ హకీమా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) మంజీత్ కౌర్ తన పోలీస్ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి గురైన వ్యక్తిని రక్షించేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసన చేస్తున్న నిహంగ్ సిక్కులు, ఆ పోలీస్ అధికారిణి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు నిహంగ్ సిక్కులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీస్ అధికారిణి డ్రెస్ కాలర్ పట్టుకుని నెట్టగా వారిని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నించారు.
ఇంతలో గాయపడిన ప్రత్యర్థి వర్గం నిహంగ్ సిక్కును వాహనంలోకి పోలీసులు ఎక్కించారు. పోలీస్ అధికారిణి మంజిత్ కౌర్ తన బృందంతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే నిరసన చేస్తున్న నిహంగ్ సిక్కులు పోలీస్ అధికారిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“ਲੱਤਾਂ ਬੰਨੋ ਇਹਦੀਆਂ ਆਹ ਫੜ੍ਹੋ CID ਵਾਲਾ ਇਹ” ਨਿਹੰਗ ਸਿੰਘਾਂ ਨੇ ਫੜ੍ਹ ਲਿਆ ਬੰਦਾ, ਮੌਕੇ ‘ਤੇ ਪਹੁੰਚੇ SHO ਮੈਡਮ ਨਾਲ ਹੋਈ ਧੱਕਾ-ਮੁੱਕੀ,ਆਹ ਵੇਖੋ ਕੀ ਬਣਿਆ ਮਾਹੌਲ#amritsar #punjab #jagbani #cid pic.twitter.com/HHrRNpHuL2
— JagBani (@JagbaniOnline) September 19, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

