కారేపల్లి, సెప్టెంబర్ 19 : సింగరేణి మండల కేంద్రంలో గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో ఏక్ పెడ్ మాకే నామ్ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బి.పద్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క మొక్క చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల కళాశాల ప్రాంగణాలలో మొక్కలను నాటించి, ఇంటి వద్ద నాటేందుకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయరాజు, కారేపల్లి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలి : ఎంపీడీవో బి.పద్మ