Hyderabad | పూజ చేస్తుండగా నిప్పంటుకుని.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి
Hyderabad | హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున పూజ చేస్తూ దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ (62) మరణించారు.
Hyderabad | హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున పూజ చేస్తూ దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ (62) మరణించారు.
వివరాల్లోకి వెళ్లే.. బేగంపేటలోని శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. రోజువారీ పూజల్లో భాగంగా తెల్లవారుజామున దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమె భయంతో ఇంట్లో అటు ఇటు పరిగెత్తగా మంటలు మరింత వ్యాపించాయి. సోఫా, కర్టెన్లు, ఇతర ఫర్నీచర్‌కు సైతం మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. అలాగే ఇంట్లో పొగ నిండిపోవడంతో ఊపిరాడక కుప్పకూలింది.
ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా, వారు వచ్చేప్పటికే విజయలక్ష్మీ మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

