సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ సజ్జనార్ శనివారం మద్యం షాపులపై ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 11న సాయంత్రం ఆరు గంటల వరకు, ఈ నెల 14న ఉదయం ఆరు గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలని ఆయన ఆదేశించారు. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, క్లబ్స్, ఇతర మద్యం సరఫరా చేసే షాపులకు కూడా ఈ ఆంక్షల నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని సజ్జనార్ వెల్లడించారు.