హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) తో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.