Hyderabad | హైదరాబాద్ : బంగాళఖాతం( Bay of Bengal )లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad ) లో రాగల మరో మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి వడగండ్ల వాన( Hailstorm ) కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం( Weather dept ) అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు ఆరంజ్ అలర్ట్( Orange Alert ) ప్రకటించారు. ద్రోణి ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు( Temperatures ) భారీగా పడిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 26.3డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19.9డిగ్రీలు, గాలిలో తేమ 71 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.