హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్‌లో తోపాటు నగరంలో అక్కడక్కడ భారీ వాన పడుతున్నది. వర్షాలతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పటాన్చెరు, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సుచిత్ర, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, బొల్లారంలో వాన కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
HyderabadRains ALERT 1 ⚠️⛈️
Dear people of Hyderabad. GET READY FOR MORNING THUNDERSTORM. North, West HYD towards Patancheru, RC Puram, Serlingampally, Gachibowli, Miyapur, Kukatpally, Gajularamaram, Nizampet, Qutbullapur, Jeedimetla, Suchitra, Alwal, Malkajgiri, Kapra,…
— Telangana Weatherman (@balaji25_t) October 5, 2025