హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping) పోలీస్ కస్టడీలో(Police custody) ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు(Radhakishan Rao) హైబీపీకి(High BP) లోనయ్యారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు రోజు పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో రాధాకిషన్ రావు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులు బయటి నుంచి వైద్యులను రప్పించి పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.