Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పది రోజుల పాటు 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. టీజీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆంక్షలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నలుగురు, అంత కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని పోలీసులు సూచించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
AV Ranganath | బఫర్జోన్లో ఐపీఎస్ రంగనాథ్ ఇల్లు!
Revanth Reddy | రేవంత్ ప్రచారం.. కాంగ్రెస్ ఓటమి.. మాయమాటల్ని నమ్మని మరాఠా జనం