రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఈమేరకు మంగళవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్, శివకుమార్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుపేద కులాల విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
– కవాడిగూడ, జూలై 7