మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మేకల మండిలో బడిబాట ప్రారంభం
బన్సీలాల్‌పేట్, జూన్ 8 : ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మరింత అభివృద్ధి చెందుతున్నాయని, తల్లిదండ్రులపై ఫీజుల భారం లేకుండా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భోలక్‌పూర్‌లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ‘బడి-బాట’ ప్రచార కార్యక్రమాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ముగ్గురు విద్యార్థులు ప్రవేశ పరీక్షలో పాసై తెలంగాణ గురుకుల పాఠశాలలో సీట్లు పొందారని పాఠశాల హెచ్ఎం మల్లికార్జున్‌రెడ్డి మంత్రికి వివరించారు. దీంతో ఆయన డిజిటల్ విధానంలో బోధన అందిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల సాధన కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, కో-కన్వీనర్ నర్సింగ్‌రావు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మిపతి, ప్రేమ్‌కుమార్, ఫహీమ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.