Harish Rao | అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని.. అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి, ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని ఒకరోజు, కేరళ నుండి వస్తున్నాడని ఒకరోజు.. నాలుగు గంటలు వృథా చేశారన్నారని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.
మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఒకరోజు పెండ్లి ఉందని పోతరు, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని అని సభ ఆపేస్తారు. అసలు సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఒకరోజు విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వాలని 4 గంటలు వృథా చేశారని.. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేశారన్నారు.
కేరళ ఎన్నికల కోసం శాసనసభని 30వ తేదీనే బంద్ పెట్టారు. కేరళ ఎన్నికలు మీకు అవసరం ఏమో..? తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో పహిల్వాన్లు అని రేవంత్ రెడ్డి అంటాడు, కత్తులతో తలలు తీసేస్తామని ఇంకో సభ్యుడు అంటాడు. మరి ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరా..? కాంగ్రెస్ సర్కార్ను హరీష్ రావు ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనాగరిక భాష మాట్లాడాడు, మరి అది రిఫర్ చేయరా ఎథిక్స్ కమిటీకి..? అని అడిగారు. మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు వరప్రదాయిని..
రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు మధ్య తేడా లేదని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించాయి. నితిన్ గడ్కరీ, పీవీ నరసింహన్ లాంటి ఎందరో ప్రముఖులు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు వరప్రదాయిని అని అన్నారు
ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్ల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని చెప్పింది. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం వల్ల గత రెండేళ్లలో వేల ఎకరాల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని నివేదిక పెట్టాడు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టుకు, మూసీలో తెచ్చే గోదావరి నీళ్లు కాళేశ్వరం నుండి వచ్చేవే కదా.
సీఆర్ పాటిల్ ఒకసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులను అడిగితే, నీళ్లు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయని స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లడానికే కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క రూ.50 కోట్లు ఇస్తే ఇంకొక 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని, రెండేళ్ల నుండి దాదాపు 20 లేఖలు రాస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తలేడని అన్నారు. మీకు మా మీద కోపం ఉంటే తీర్చుకోండి.. కానీ ఆ కోపాన్ని రైతుల మీద చూపకండని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు
అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి, ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని ఒకరోజు, కేరళ నుండి వస్తున్నాడని ఒకరోజు.. నాలుగు గంటలు వృథా చేశారు
ఒకరోజు పెండ్లి ఉందని పోతరు, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని అని సభ ఆపేస్తారు
అసలు… pic.twitter.com/aaQmdsGSPV
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు మధ్య తేడా లేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించాయి
నితిన్ గడ్కరీ, పీవీ నరసింహన్ లాంటి ఎందరో ప్రముఖులు… pic.twitter.com/j1sGAbtzDa
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026