శంషాబాద్ రూరల్, మే 28 : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు. పేదలకు ఆనారోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించుకోలేక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారికి నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆర్థికంగా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని పాలమాకుల గ్రామానికి చెందిన బాలరాజ్‌కు 32వేలు, కవ్వగూడ గ్రామానికి చెందిన రొడ్డ సాయికి38వేలు, సాయికి 60 వేలు, మెరుగు లావణ్యకు 38వేలు, జూకల్ గ్రామానికి చెందిన కుమార్‌కు 31వేలు, మల్కారం గ్రామానికి చెందిన ప్రేమలతకు 50వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.