స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలని ప్రైవేట్ ఉద్యోగికి టోకరా
స్టాక్ ట్రేడింగ్‌లో టిప్స్ చెబుతామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ.3.27 లక్షలు టోకరా వేశారు. అల్వాల్‌కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మిని173డి రన్నర్స్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌కు యాడ్ చేశారు. అందులో ట్రేడింగ్స్ టిప్స్ చెబుతూ, ఆ టిప్స్ ఫాలో కావడంతో తమకు లాభాలొచ్చాయని అందులోని వారు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు.
సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్‌లో టిప్స్ చెబుతామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ.3.27 లక్షలు టోకరా వేశారు. అల్వాల్‌కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మిని173డి రన్నర్స్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌కు యాడ్ చేశారు. అందులో ట్రేడింగ్స్ టిప్స్ చెబుతూ, ఆ టిప్స్ ఫాలో కావడంతో తమకు లాభాలొచ్చాయని అందులోని వారు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. మీరు కూడా చేరండి లాభాలొస్తాయని ఫోన్లు చేసి, సీఎంఈ గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌కు యాడ్ చేశారు.
దాని ద్వారా లింక్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని సూచించడంతో బాధితుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టడంతో లాభం వచ్చింది. ఆ తరువాత మాటలు చెబుతూ దఫదఫాలుగా రూ.3.30 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అందులో రూ. 3 వేలు మాత్రమే తిరిగి వచ్చాయి. స్క్రీన్‌పై కన్పిస్తున్న డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

