Droupadi Murmu | హైదరాబాద్ : ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్కడ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్, ఆర్ అండ్ బీ, అగ్ని మాపక శాఖ, విద్యుత్ శాఖ, వైద్యారోగ్య శాఖ, జీహెచ్ఎంసీతో నిర్వహించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్‌తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా ఏర్పట్లలో పాల్గొనే అధికారుల జాబితాను తమకు అందించాలని కోరారు. అగ్ని మాపక శాఖ పాత్ర కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. నిరంతరం ఫైర్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ద్య పనులు నిరంతరం జరగాలని సూచించారు. స్ట్రీట్ లైటింగ్, లూస్ వైర్లు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఐదు మెడికల్ స్టాల్స్‌తో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా స్టేజ్ ఏర్పాటుపై ఆర్ అండ్ బీ శాఖ ధృవీకరణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వెంటకాచారి, ఆర్డీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Lagacherla | చావడానికైనా సిద్ధం.. భూములు ఇచ్చేది లేదు : లగచర్ల బాధితులు
Group-3 | గ్రూప్-3 పరీక్షలకు 50 శాతం మందే హాజరు
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ.. నిప్పులు చెరిగిన ఎంపీ డీకే అరుణ