సిటీబ్యూరో, జూన్ 9 ( నమస్తే తెలంగాణ ) : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి నుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిబంధనలతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్నారు.
ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు అందించొచ్చని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం , 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను విన్నవించవచ్చని సూచించారు. అనంతరం ప్రజల నుంచి విన్నపాలను స్వీకరిస్తామన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి ఉంటుందని ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు.