అల్వాల్, జూలై 10: అల్వాల్ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చొరవతో అల్వాల్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మర్రి అల్వాల్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరగా..
స్పందించిన మంత్రి వెంటనే అల్వాల్‌లో రిజిస్ట్రార్ కార్యాలయానికి తగిన స్థలం చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ఎమ్మెల్యేతో కలిసి అల్వాల్ సఖి సెంటర్ సమీపంలోని బాలసదన్ భవనాన్ని పరిశీలించారు. భవనంలో చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి త్వరలోనే కార్యాలయాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.